Written by BhaanuChandara
ఆలోచన..అది
మంచిదా! చెడ్డదా!
అన్నది మనకనవసరం.
దానితోపాటే
మనం ప్రయాణిస్తాం.
ఆ ఆలోచనతో ఆనందంలో మునుగుతాం..ఆవేదనకు గురవుతాం...భావుకతతో పూల
పరిమళమై తేలిపోతాం...భాదతో బరువుగా మారిపోతాం.....ఆశతో గగనానికి నిచ్చెన
వేస్తాం...నిరాశతో నిర్వికారంగా మారిపోతాం.
మన మనసుని ఆవిష్కరిస్తూ...లోలోపల
పార్శ్వాలను మనకు తెలియకుండానే మనకు తెలియచెప్తుంది.
మనిషి యొక్క
స్ట్రెంగ్త్ ఈ ఆలోచనే....ఈ లోచనాలు తగిలించుకునే మనం ప్రయాణిస్తాం.
మన చుట్టు ఉన్న
వ్యక్తుల ప్రభావం వల్లనైతేనేమీ ...పరిసరాల ప్రభావం నైతేనేమి మనం ఓ విధమైన నైరాశ్యములో
కూరుకుపోతుంటాం.
ఎల్లప్పుడు
కాకపోవచ్చు...అప్పటివరకు సంతోషముతో ఉన్న మనం ఒక్కసారిగా ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటాం.
ఎందుకని మీరెప్పుడైనా
ఆలోచించారా? లోపం ఎక్కడుందో గమనించారా! ఇక్కడ మన మీద మనకున్న విశ్వాసాన్ని పాతిపెట్టేసి
ఎదుటివారి మాటలో అడుగులేస్తాం
వివరముగా చెప్పాలంటే, మనం మన కన్నా ఎదుటి వ్యక్తి మాటలకూ ...చేతలకు ఎక్కువ
విలువ ఇస్తూ మనల్ని మనం కించ పరుచుకుంటూ దుఃఖంలో జీవిస్తున్నాం.
సందేహముతో సదా దోబూచులాడుతున్నాం.
ఈ ఆలోచన ఆత్మన్యూనతా
భావాన్ని రగిలిస్తూ చుట్టూ ఉన్నవారిని కాల్చేస్తుంది.
ఈ ఆలోచన ఆనాగరికతకు
నాంది పలుకుతూ
అన్యాయముగా వ్యవహరిస్తోంది.
ఈ ఆలోచన సంస్కారాన్ని
కోల్పోయి అనాగరికమవుతుంది.
ఈ ఆలోచన ఒంటరిని
చేసి ...శక్తి హీనుడ్ని
చేస్తుంది.
అదే ఆలోచన బలమై ..ప్రతి
ఒక్కరికి అండగా
మారుతుంది
అదే ఆలోచన విశ్వాసమై చుట్టూ
ఉన్న జనానికి నమ్మకమవుతుంది.
అదే ఆలోచన సంస్కారపు
మమకారాల నెలవవుతుంది.
అదే ఆలోచన ప్రతి
ఒక్కరి బాగు కొరకు బావి తరాల మదిలో స్థానం కల్పిస్తుంది.
ఏతావాతా చెప్పేదేమిటంటే
ఓ మంచి ఆలోచన మనలో అనంత శక్తిని ప్రసాదిస్తూ.. అంతులేని ఐశ్వర్యపు ప్రదాత
అవుతుంది.
దుఃఖమనే భావన నదిని దాటి
అనందమనే ప్రపంచములో విహరించండి.
ఉన్నది ఒకటే జీవితం..అందమైన ఈ జీవితానికి దుఃఖమనే ఆల్కహాల్
పోసి పాడు చేయకండి.
మీరు సంతోషముగా
ఉంటూ మీ సంతోషాన్ని తోటివారికి పంచండి.
ఈ సంతోషం మీకు
నూరేళ్ళ ఆయుష్షును
ప్రసాదిస్తుంది