25, జనవరి 2023, బుధవారం

HALLUCINOGENIC

 

                                                            Written by Bhanuchandara



నేను చీకటిలో నడుస్తున్నాను....


కాలికి ఏదో మెత్తగా తగిలింది...పాము పామంటూ గట్టిగ అరుస్తూ వెనక్కి దూకాను.


ఆలా వెనక్కి గెంతటం వళ్ళ అక్కడ ఉన్న రాయి  నా శరీరాన్ని గాయం చేసింది. 

    


నన్ను కరిచి ఉంటుందేమోనన్న భయముతో కాసేపు అలానే అరవకుండా మౌనముగా ఉండిపోయాను.


అది ఇంకా అక్కడే ఉంది....మినుకు మినుకు పురుగుల జ్వాలలో అది ఇంకా అక్కడనే తచ్చట్లాడుతుంది.      


నేను పెద్ద పండితుడ్ని......ఓ పక్క చెమట్లు..స్వేదముతో నిండిన వదనాన్ని చేతులతో తుడుచుకుంటూ ..భయ భయముగా  ..అదే పామో... అదే జాతిదో చూద్దామని నా దగ్గర ఉన్న బుక్ ఓపెన్ చేశాను. నా దగ్గర ఉన్న బుక్ లో దాని గురించిన సమాచారం లేదు.


ఆ బుక్ పక్కన పడేసి నా బాగ్ లో దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందేమోనని వెతుకుతున్నాను.


ఉహు...  ఏం దొరకలేదు.


ఓ పక్క క్షణ క్షణానికి  నాలో దడ రెట్టింపు అవుతుంది...కాళ్ళు చేతులు బిగుసుకుపోతున్నాయి. నోట్లో లాలాజలం స్రవిస్తుంది....ఇంకా నేను కొద్దీ క్షణాల్లో చచ్చిపోతున్నాను.


బహుశా ఇది కట్ల పాము అయుటుంది. అందుకే ఇంత తొందరగా నేను....    కళ్లు మూతలు పడుతున్నాయి.  


ఇంతలో ఉన్నట్లుండి ఎక్కడినుండో వెలుతురు వచ్చింది. బలవంతముగా కళ్ళు తెరిచాను.  ఆ వెలుతురూ లో దాన్ని చూడగా  అది తాడు.


ఒక్కసారిగా నవ్వాను.  ఆ నవ్వు  నాలోని సర్వ అవయవాలకు జీవం తెచ్చింది. ఆ జీవం నాలో క్రొంగొత్త శక్తిని ధారపోసింది. 

 

నా ఊహకు  ...నా మనసు యెంత బయపడింది. చావుకు సర్వస్య శరణాగతి అంటూ మోకరిల్లింది.         

 

తాడు ని చూసి పామనుకున్న నా పాండిత్యానికి నేను సిగ్గు పడ్డాను.


అలానే పాము కాటేస్తే దాని మందు కోసం ప్రయత్నించకుండా  అది ఏ పాము? అంటూ దాని గురించి తెలుసుకోవాలనుకొవటం అనవసరమైన జిజ్ఞాసా కాకా మరేమిటి? 

 ఆ క్షణం బయపడవచు ...కానీ ఆ భయానికి దాసోహం అవ్వాల్సిన పని లేదు. ఈ భయం తోటే లేని పోనీ రోగాలను తగిలించుకుంటున్నాం.        


అంటే ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సమస్యకు పరిష్కారం చూడకుండా ఎటో ఎటో ప్రయాణిస్తున్నాం. 


కరిచింది పామో తాడో తెలుసుకోకుండా భయమనే చీకట్లో మగ్గుతున్నం      


సమస్య ఉందొ లేదో తెలుసుకోండి .... నిజముగా సమస్య ఐతే దానికి  పరిష్కార మార్గం చూడండి. అనవసర విషయాల గురించి ఆలోచించకండి. 

    

అనవసర భయాలు మిమ్మల్ని నిలువునా పాతిపెట్టేస్తాయి.


సో భయాన్ని వీడండి..ఎరుకతో ఉండండి.

భాను చందర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Mind

                                                                                            Written by Bhanuchandara     మనసు ...ఓ అద్భుతము....