25, జనవరి 2023, బుధవారం

EGO

            

                                                  Written By Bhanuchandara


 గోళీకాయలాటల్లో గోల గోల చేసి ..ఎదుటి వారిపై గొడవ గొడవ చేసిన మనిద్దరకి 

ఇప్పుడు నువెవ్వరో నాకు తెలియదు ..నేనెవరో నీకు తెలియదు


మూడు రెళ్లేంత అని మాస్టర్ అడిగిన ప్రశ్నకి నాతొ జవాబు చెప్పించి నన్ను శభాష్ అంటూ పొగడపూల దండ వేయించిన నువెవ్వరో నాకు తెలియదు..నేనెవరో నీకు తెలియదు        


పీచుమిఠాయి కోసం ఒకరి మూతి మరొకరం లొట్టలేసుకుంటూ చీకేసుకున్న మనిద్దరికీ

నువెవ్వరో నాకు తెలియదు ..నేనెవరో నీకు తెలియదు


కాలేజీలో పద్మిని కోసం జుట్టు జుట్టు పట్టుకుని ఒళ్ళు వాచేలా కొట్టుకున్న మనిద్దరికీ 

ఒకరంటే ఒకరికి తెలియదు..బహుశా మనిద్దరికీ చత్వారం వచ్చిందేమో!


మామ చీర్స్ అంటూ ఒకరి గ్లాస్ని మరొకరం కాలి చేసేసి మత్తులో ఒకరి ఒళ్ళో ఇంకొకరం జోగిన మనిద్దరికీ మత్తు ఇంకా దిగలేదేమో!


మీ ఇంటి కాకి మా ఇంటి మీద వాలటంలేదు..మా ఇంటి కాకి మీ ఇంటివైపు పోవటంలేదు      

కాకులే దారి తప్పాయో ...పుకారులే దారి తప్పించాయో మనిద్దరం దారి తప్పాము.


అల్లంత దూరాన నీ నీడకి నే వంగుతున్న...నా క్రీనీడలో నువ్వు క్రుంగుతూ నక్కి నక్కి   

నడుస్తున్న మనిద్దరం మొక్కై భూమిని చీల్చుకుంటూ ఎప్పటికి బయటకు వస్తామో!   


గుండెలోతుల్లో దాగిన కన్నీటి ఊటను తోడేస్తే ..ఏమైనా....

ఉహు....ఉపిరిలోన ఊపిరై...కన్నీళ్లు ఉప్పెనై  ఉప్పొంగి..ఎగిసిన ఎదలో 

నువ్వు నేను తల దాచుకుందాం....అహాల కోరలు పీకేసి ...

హాయిగా వేప చెట్టు నీడలో గత కాలపు స్మృతుల్ని నెమరేసుకుందాం.


మీ 

భాను చందర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Mind

                                                                                            Written by Bhanuchandara     మనసు ...ఓ అద్భుతము....