Written by Bhanuchandara
మా వూళ్ళో ఓ పడుచుంది దెయ్యమంటే భయమన్నది.
ఎస్.... బుర్రుపిట్ట నీడను చూసి భయపడ్డ యువతి లానే ఉన్నాం...మనం.
ఏడుపు..కోపం...ద్వేషం ఇత్యాదివాటిని మోస్తూ అనుక్షణం భయం భయముగా జీవిస్తున్నాం. జీవితాన్ని భయమనే చీకట్లోకి నెట్టేసి ఆనందాన్ని కోల్పోయాం....ఈ నిశిలో సూర్య కిరణం కొరకై పూజలు చేస్తున్నాం.
మనలోని మనసుకు శాంతి లేకుండా..అశాంతిని అందిస్తున్నాం.
మన హృదయములో ప్రేమకు బదులు..ద్వేషాన్ని జలసిని నింపేస్తూ..ఆశకు బదులు..అత్యాశను నింపేస్తూ మన మనసుని విషమయం చేస్తున్నాం.
అలానే మనం కోపాలు...ద్వేషాలు...జలసిలు..పగ..ప్రతీకారం ఇత్యాదివాటితో మన గుండె బరువుని...మన శరీరానికి మోయలేని బరువుని అందిస్తూ ఆయాసపడిపోతున్నాం.
మనకు అన్ని తెలుసు....మనమేది ఇస్తామో..అదే మనకు తిరిగి వస్తుందని తెలుసు. అయినా బుద్ది మాట వినకుండా..మనసు మాట వింటాం....మనసు అడుగుజాడల్లో నడుస్తాం...కష్టాల సుడిగుండములో గిరగిరా తిరుగుతాం.
అదేమంటే కలికాలం మంటూ ..మన ప్రారబ్దమంటూ..మెట్ట వేదాంతాన్ని వల్లే వేస్తాం.
స్వతహాగా మనం మంచివాళ్ళమే ..కానీ మన మంచితనాన్ని ..అతితెలివితేటలతో..చెప్పుడు మాటలతో...జలసితో...దాచిపెడుతున్నాం.
నేనే సర్వమంటు..అహంకారాన్ని ప్రదర్శిస్తూ...దురహంకారముతో విర్రవీగుతాం.
నంది కొండ వాగుల్లోన..నల్ల తుమ్మ నీడల్లో...చంద్ర వంక కోనల్లోన...సందె పొద్దు సీకట్లో..
నీడల్లే ఉన్నా..నీతో వస్తున్నా..నా ఊరేది..ఏది?..నా పేరేది..ఏది?..నా దారేది..ఏది? అన్నట్లు ఇక్కడ ఊరు పేరు లేని మన ఇగోని వైఫై లా వెంటపెట్టుకు తిరుగుతున్నాం.
కుదిరితే కొంచెం మంచితనాన్ని..కొంచెం శాంతిని పంచుదాం...అది కుదరదంటే అశాంతికి దూరముగా ఉందాం.
మహా అయితే అశాంతి పోతుంది.
లోకాస్సమస్తాసుఖినోభవంతు
మీ భాను చందర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి