Written by Bhanuchandara
నేను నల్లగా..పొట్టిగా..అందవీహీనముగా...పెద్దగా ఆకర్షణ లేకుండా ఉన్న నేను పదే పదే ఎదుటివారు తెల్లగా...అందముగా..ఆకర్షణీయముగా ఉన్నారని తల్చుకుని బాధపడటంవల్ల ప్రయోజనం లేదు.
నాకు అది లేదు..ఇది లేదు...అంటూ పదే పదే మనల్ని మనం కించపరుచుకుంటూ సాగడమేనా జీవితం.
ఈ పోలికలు ఇక్కడితో ఆగవు...పక్కింటి వారి ఆస్తులు అంతస్తులు అన్నింటిపై మన కన్ను పడుతుంది....ఈ నయనం గవాక్షాలు దాటి ప్రవేశిస్తుంది....దీనికి మనసు తోడై చింతని నింపేస్తుంది....ఈ చింత చెట్టంత మనిషిని అతలాకుతలం చేస్తుంది.
మన పని మనం చేయాలి..ఆ పని మనల్ని ఎదుటివారికి పరిచయం చేస్తుంది.
ప్రతి మనిషి ఆలోచన ఒకే విధముగా ఉండదు...ఒక మనిషి ఉన్నదానితో తృప్తిగా ఉంటె...ఇంకో మనిషి ఆశల అంతస్తుల్లో విహరించాలని కళలు కంటూ ఉంటాడు.
ప్రతి మనిషికి ఆశ అవసరం..ఆశను మించిన ఆశ అదే అత్యాశ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఊపిరాడనివ్వకుండా చేస్తుంది.
ఏతావాతా చెప్పేదేమిటంటే...ఒకరి జీవితానికి ఇంకొకరి జీవితాన్ని ముడి పెడుతూ సాగే ప్రయాణం సాఫీగా ఉండదు.
సూర్యుడికి చంద్రుడికి మధ్య పోలికే లేదు ...వారి వారి సమయాలలో వారు ప్రకాశిస్తుంటారు. ప్రజలకు ఆనందాన్ని పంచుతుంటారు.
అంతే కాదు నేను పలనా టైం లో ఆ విధముగా వ్యవహరించకుండా ఉంటె బాగుండేదనుకుంటు ..బాధపడుతూ చింతిస్తుంటాం ...ఈ చింత ... వ్యధల కుంపట్లో కాల్చేస్తూ మనల్ని భాదిస్తు ..ఈ బాధలో మనం పరిష్కారపు మార్గాన్ని మరిచిపోతున్నాం.
నిన్నటి పొరపాట్లతోనో రేపటి గురించిన భయముతోనో రోజులను వృధా చేసుకుంటూ కాలం గడిపేద్దామా!
మన ఆశలు.కోరికలు అన్ని మన జీవితాన్ని ప్రకాశవంతముగా మార్చాలి కానీ....అంధకారం మన గమ్యం కాకూడదు.
ప్రక్క వారి ప్రగతి మనకు ఇన్స్పిరేషన్ కావాలి....ఆ ఇన్స్పిరేషన్ మన జీవితానికి..మన భావితరాలకు వెలుగవ్వాలి.....అదే మన జీవితానికి మనమిచ్చే బహుమానం....ఈ బహుమానం (ఎరుక) మన ఆత్మలకు శాంతిని ప్రసాదిస్తుంది...(ఆంటే మరు జన్మ లేకుండా చేస్తుంది) ఆ కాంతి తరతరాలకు ప్రకాశిస్తుంది.
సర్వేజనాసుఖినోభవంతూ అంటూ ముందుకు సాగుదాం
మీ భాను చందర
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి