Written by Bhanu chandara
నేను ఒక్కడినే….నా చుట్టూ కాటుక లాంటి చీకటి. గట్టిగ కళ్ళు నులుముకుని తేరిపారచూశాను… ఏమి కనపడలేదు.
ఎక్కడికి వెళ్లాలో తెలియదు…. ఎటు వెళుతున్నానో తెలియదు….. అయినా నడుస్తున్నాను. నడుస్తూ…
నడుస్తూ కిందకు జారీ పడ్డాను. ఓ పక్క భయం. మరో ప్రక్క భయముతో కూడిన దుఃఖం తో గాడ్ అంటూ పెద్దగా అరిచాను.
ఎవరో ఎగతాళి
చేస్తున్నట్లు...ఎవరెవరో నన్ను సుడిగుండములో ముంచిన అనుభూతి
అలాంటి
అనుభవాల దుఃఖముతో నా శరీరం స్వేదంతో నిరశించిపోతుంటే…నిశ్శబ్దమనే శబ్దం నన్ను మరింత బయపెట్టేస్తుంటే,
అదిరే గుండెలను అరచేతిలో పట్టుకుని అలానే కొంచెంసేపు
ఉండిపోయాను. ఇంకో ప్రక్క వెళ్లక తప్పని పరిస్థితి.
కొంచెం.. కొంచెం ధైర్యాన్ని కూడగట్టుకుని అలానే పైకి లేచాను.
ఎవరో సర్రున నన్ను తోసేసి మందుకు వెళ్తుంటే,
గజ గజ మంటూ వణుకుతున్న నా శరీరాన్ని స్వాధీనములో తెచ్చుకుంటూ హూ అర్ యు? అని కోపముతో అరిచాననుకున్నాను. నోట్లో నుండి మాటే రాలేదన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను.
ఎక్కడ నుండో ఊఉ ఊఉ అంటూ భయంకరముగా మూల్గులు. అంతలోనే వికృతముగా నవ్వుతు నా చుట్టే ఎవరో గిర గిర వేగముగా తిరుగుతున్నట్లు......ఉ...ఉ ..హు? అని అరిచాను. అరిచాను అనుకున్న కీచుగొంతు తో పిలిచాను. ఎవరు పలకలేదు.
ఓ పక్క నుండి గజ్జలు గళ్ళు..గళ్లంటూ మోగుతుంటే నేను ప్లీజ్…ప్లీజ్ అంటు అభ్యర్దిస్తుంటే తెరలు తెరలు గా నవ్వు.. ఆ నవ్వు నా గుండెలో చేరి నాలో మరణమృదంగమై ధ్వనిస్తుంటే, చావుకు సిద్ధమై అన్నిటికి తెగించిన నేను,
నా అణువణువులో పేరుకుపోయిన భయాన్ని...బాధని బలవంతముగా వదిలించుకుని,….నాకు నేను ధైర్యమై…అనంత విశ్వాసముతో రొమ్ము విరుచుకుంటూ ఆనందమైన ప్రయాణానికి ఆది నేనంటూ నడక ప్రారంభించాను.
నడకతో మొదలైన నా ప్రయాణం పరుగుగా మారింది. ఆ పరుగులో నా కాలికి గాజుపెంకులు గుచ్చుకున్నాయి...పదునైన కత్తులు పొడుచుకున్నాయి. ఈ బాధలో నేను వదిలేసిన భయమనే దయ్యం మల్లి వచ్చి నన్ను ఆప్యాయముగా కౌగలించుకుంది.
ఆ ఆప్యాయతకు లొంగకుండా…సానుభూతి వసారాలో నిలబడకుండా, నా ప్రశ్నకు నేనే సమాధానమై, మహదానందముతో దూరముగా మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్న, నాకు ఆదర్శమైన వెలుతురు వైపు…..వెలుగుతూ పరుగెత్తాను.
BHANUCHANDARA
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి