Written by Bhanuchandara
చదువుకోపోతే
అమ్మానాన్నలు కొడతారేమో..తిడతారేమో అనుకుంటూ మొక్కుబడిగా..భయముగా చదివే వాళ్ళం...ఎవరైతే
భాద్యతగా చదివారో వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు.
అలానే మనం చేసే
పని కూడా పక్క వాళ్ళ మెప్పుదల aకోసమో..లేక పని చేస్తే డబ్బులు వస్తాయనే ఆలోచనతో పని చేస్తే
మన భవిష్యత్తు కూడా జీతం వరకే ఉండిపోతుంది.
ప్రధానముగా
ఇక్కడ నేను మనలోని భాద్యతను...భాద్యత యొక్క భద్రతను తెలియచేస్తున్నాను.
మనకు భాద్యత
తో ఉన్నామా! లేక భయము(మొక్కుబడి) తో ఉన్నామా!
ఇది తెలుసుకోవాలంటే మన గురించి మనం తెలుసుకోవాలి.
మనం ఒక పని
వేరే వాళ్ళ గురించి చేస్తే అది మొక్కుబడి లేక భయముతో కూడిన "తప్పనిసరి పని" అయ్యుంటుంది. అది మన ఇష్టపూర్తిగా చేస్తే అది భాద్యత
అంటే ఇక్కడ ప్రతి మనిషికి కావాల్సింది భాద్యత. ఈ భాద్యత అనేది ఎవరు చెప్పేది
కాదు...ఎవరు చెప్పిన
వచ్చేది కాదు..మనంతట మనం అలవర్చుకోవాల్సిన గుణం.
ఇక్కడ భాద్యత
తో కూడిన మన భాద్యత మనల్ని గొప్పవారిని చేస్తుంది.
ఇంకా గొప్పగా
చెప్పాలంటే మనల్ని సృష్టికర్తల్ని చేస్తుంది...సంపూర్ణముగా చెప్పాలంటే మనల్ని ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దుతుంది.
అమ్మానాన్నలకోసం
చదివి ..అమ్మానాన్నల (ఏదో కష్టపడాలి కాబట్టి)
కోసం జాబ్ చేసి..అమ్మానాన్నల (నలుగురి మెప్పు) కోసం పెండ్లి చేసుకుని..అమ్మానాన్నల (గొప్పతనం) కోసం పిల్లల్ని కనీ బ్రతికేస్తున్నాం.
మనకు లా గురించి
తెలియదు. కానీ లా లోని లోతుపాతుల్ని ఎత్తి చూపుతాం...దేశ ప్రధాని చేసే పనుల్లో తప్పొప్పుల్ని
చూపిస్తాం . అమెరికా..రష్యా గురించి మాట్లాడుతాం.. చైనా చేసే దుర్మార్గం గురించి పుంఖానుపుంఖాలుగా
ప్రవచిస్తాం.
మనం మాత్రం
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మనల్ని మనం ఆత్మవంచన చేసుకుంటూ సొల్లుకబుర్లతో...వేరే
వాడి సొల్లుకబుర్లు వింటూ కాలం గడిపేస్తాం.
ఇక్కడ ఎక్కడ
మన కోసం కానీ... ఆత్మ తృప్తి కానీ లేకుండా... వాళ్ళ మీద వీళ్ళ మీద మధ్య మధ్యలో ఉప్పూకారం
చల్లుతూ..మంచి స్మెల్ రావటానికి మసాల వాడుతూ...అందర్నీ వాడేసుకుంటూ ..వేడి వేడి మాటలతో
వేయించేస్తాం.
మనలో యెంత మంది
భాద్యత గా ఉంటున్నారు...? ఒక పనిని యెంత మంది భాద్యత గా నిర్వహిస్తున్నారు...ఆలోచిస్తే
......?????????
వీటికి ఆన్సర్స్
దొరికితే...మనమేమిటో మనకు తెలుస్తుంది...మన గమ్యం మనకు అవగతమవుతుంది.
లోక సమస్తాసుఖినోభవంతు
Bhanuchandara
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి