Written by Bhanuchandara
మానవుడికి ప్రకృతికి అవినాభావ సంబంధముంది.
ప్రక్రుతి మనకు సూచనలు..సలహాలు ఇస్తున్న పట్టించుకోము....ఎందుకంటే "ఐయామ్ గ్రేట్" అనుకుంటూ కాలరు ఎగరేస్తాం.
మారిన జీవనశైలిలో తనకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకునే క్రమములో మనిషి ఎంతో వత్తిడికి గురవుతూ పడుతూ..లేస్తూ సాగించే ఈ ప్రయాణంలో మనిషి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఆనందమో..విషాదమో అర్థంకాని ప్రయాణంలో నడుస్తున్నాడు.
ఎనర్జిటిక్ అల్గోరిథం ప్రకారం ఒక విషయాన్ని పదే పదే ఆలోచించిన లేక మనం ఒక పనిపై మక్కువ తో మనసా వాచా కర్మణా చేస్తున్న ఈ విశాల విశ్వం మన ఆలోచనలకూ..భావాలకు తగ్గట్లే చుట్టుపక్కల వాతావరణాన్ని మనకనుకూలముగా సిద్ధం చేస్తుంది.
ఒక చదువుకునే విద్యార్ధి స్కూల్ లో టీచర్ చెప్పింది విని వచ్చి పరీక్షలకు ముందు ఒకసారి బుక్ తిరగేస్తే ఆ కుర్రోడికి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఈ కుర్రోడు తన మైండ్ ని పాజిటివ్ గా ట్రైన్ చేసుకోవడం వల్ల అతనికి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వస్తున్నాయి.
అదే ఇంకో కుర్రోడు సేమ్ టీచర్ చెప్పింది విని రేయింబవళ్లు కస్టపడి చదివిన ఆ కుర్రోడికి ఫస్ట్ క్లాస్ మార్క్స్ రావటం వెనుక ఉన్న రహస్యం ఇదే యూనివర్స్ లా.
అంటే ఇక్కడ ఈ ఇద్దరి మైండ్ సెట్ వేరు..వేరు. ఒకరు తను ఒక్కసారి చదివితే అన్ని వచేస్తాయనుకున్నారు..ఇంకొకరు తను కష్టపడాలని..కష్టపడితినే మార్క్స్ వస్తాయని ఫీల్ అయ్యాడు.
వీరి ఆలోచనలకు తగ్గట్లే వీళ్ళ బ్రెయిన్ లోని ఏనర్జిటిక్ అల్గోరిథం వీళ్ళను ట్రైన్ చేసింది.
అంటే… పైకి రాయీ విసిరితే రాయీ వచ్చి మన మొహానికి తగులుతుంది..పూలు విసిరితే పూలు వచ్చి మనపై పడతాయి. మనం మంచిని కోరుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది...చెడుని కోరుకుంటే మనకు అంత చెడు జరుగుతుంది.
అంటే మనం తీవ్రమైన ద్వేషముతో ఉంటె చుట్టుపక్కల మనల్ని ద్వేషించే వాళ్ళు మన చుట్టుపక్కల ఎక్కువ మంది ఉంటారు...అదే మనం అభిమానంతో..ఆప్యాయతతో మాట్లాడితే మనల్ని ప్రేమించేవాళ్ళు..అభిమానించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు.
అంటే "Entire Universe against you (or) Entire Universe supports you " This depends on our mindset. This is law of Universe Theory.
Entire enivornment మన ఆలోచనలకూ తగ్గట్లే స్పందిస్తుంది.....మన ప్రతిబింబాన్ని అందరిలో చూపుతుంది.
మన బ్రెయిన్ లో ఉన్న hyotholams అనే gland .....peptides అనే ప్రోటీన్ ను (ఎమినో ఆసిడ్స్) ప్రొడ్యూస్ చేస్తుంది.
peptides అనే ప్రోటీన్ న్యూరో ట్రాన్స్మిటర్ లా పని చేస్తుంది. అంటే ఒక peptide కొన్ని ట్రిలియన్ సెల్స్ ప్రొడ్యూస్ కు కారణమవుతుంది.
ఒక గంట సేపు మనం డిప్రెషన్ లో ఉండిపోతే peptide అనే ప్రోటీన్ ను ఇరవై ట్రిలియన్ సెల్స్ నుండి ముప్పై ట్రిలియన్ సెల్స్ వరకు డూప్లికేట్ని తయారు చేస్తుంది. అంటే మన బాడీ మొత్తాన్ని మనకు తెలియకుండా పూర్తిగా తన అధీనములో తీసుకుంటుంది.
ఈ విధముగా... అంటే ఏదో అయిపోయిందని భావనతో సగం నీరసించి అనారోగ్యాలను కొని తెచ్చుకున్న వాళ్ళు చాల మంది తమ ఆరోగ్యాలను పాడుచేసుకుని, జీవితాన్ని అర్థాంతరంగా ముగించినవాళ్లు ఎంతో మంది ఉన్నారు.
అంటే మనం ఆనందముగా ఉంటె మన బాడీ మొత్తాన్ని ఆనందముగా ఉంచుతుంది. అదే డిప్రెషన్ ను ఆశ్రయిస్తే మన టోటల్ బాడీ మొత్తం డిప్రెషన్ లో కూరుకుపోతుంది. టోటల్ బాడీ డిప్రెషన్ లోకి వెళ్ళటం వల్ల బాడీ లో ఉన్న బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్లిపోతుంది..ఇది యెంత ప్రమాదకరమో ఒక సారి ఆలోచించండి
ఎటువంటి పరిస్థితి ఎదురైనా మనం యెంత భాద ఉన్న డిప్రెషన్ ఉన్న మనం నెగటివ్ థాట్స్ దూరముగా ఉండాలి ...అప్పుడే మనం పదికాలాల పాటు ఆనందముగా ఉంటాం.
మన థాట్స్ ని బట్టి చుట్టుపక్కల వాతావరణం మనకోసం వేచి ఉంటుంది.
మహారాజుల జీవిద్దామా..లేక బానిసల బతికేద్దామా.
పౌలో అనే బ్రెజిల్ రచయిత ALCHEMSIT అనే బుక్ లో విశ్వం గురించిన ఎన్నో రహస్య విషయాలు తెలియపర్చాడు. వీలయితే చదవండి.
లోకసమస్తాసుఖినోభవంతు
భాను చందర