Written by Bhanuchandara
మనసు ...ఓ అద్భుతము.
మనసు మనలోని కోరికలకు రెక్కలు తొడిగి మనల్ని ఆకాశయానం లో విహరింపచేస్తుంది.
మేఘాలపై ఉరేగిస్తుంది. అందని ద్రాక్షలా ఊరిస్తుంది.
పసిపిల్లాడిలా మారం చేస్తుంది...మనలోని భావుకతకు పరిమళమద్ది పరవశిస్తుంది...మనలోని భయాందోళనల నిశిలో కనబడకుండా దాక్కుంటుంది.
మనలోని దైవ భక్తికి ..శక్తి ని మిళితం చేసి దేవుడిని చేస్తుంది.
మనలోని ఊహలకు ఊపిరులద్ది నవ ప్రపంచాన్ని నిర్మిస్తుంది.
మనలోని దుష్టత్వానికి దుర్మార్గం పెనవేసి అమాయకులను ఊచకోత కొస్తుంది.
అసలు ఒక్కటేమిటి రౌద్రమవుతుంది...జాలీగా మారుతుంది....చిరునవ్వవుతుంది ...ఏడుపవుతుంది....దుఃఖమవుతుంది.... ...ఆనందమవుతుంది...మంచవుతుంది.. చెడ్డవుతుంది....న్యాయమవుతుంది.....అన్యాయమవుతుంది..అనుమానమవుతుంది..అభిమానమై ప్రాణాలు తీస్తుంది.
పట్టుదలై మెట్టు దిగనంటుంది.....దిగులుగా మారి కృంగదీస్తుంది ...నమ్మకమై విజయతీరాలకు చేరవేస్తుంది...ధర్మమవుతుంది..అధర్మమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పొతే...... పరిపరివిధాల మనకు గోచరిస్తు...మనల్ని నడిపిస్తూ ఆడిస్తుంది.
ఏతావాతా చెప్పేదేమిటంటే మనసుకు కళ్లెం వేయకపోతే మనల్ని బ్రేక్ డాన్స్ వేయిస్తుంది. సో ..మనసు చేసే మాయలో పడకండి ఎరుకతో ఉండండి.